rtc: పక్క రాష్ట్రంలో నెరవేర్చిన వాటిని చులకన చేయడం సరికాదు: కేసీఆర్ వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి స్పందన
- ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు
- దూరం ప్రాంత ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయి
- సంఘాలు కార్మికుల హక్కుల కోసమే పనిచేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విషయంలో నెరవేర్చిన డిమాండ్లను చులకన చేసి మాట్లాడడం సరికాదని అన్నారు.
తాము చేస్తున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చాలా ఆరోపణలు చేశారని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారని ఆయన తెలిపారు. దూర ప్రాంతాలకు సేవలు అందించే ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయని వివరించారు. సంఘాలు కార్మికుల హక్కుల కోసమే పనిచేస్తున్నాయని, సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.