eggs: ప్రతి రోజు తనకిష్టమైన కోడిగుడ్లు తెచ్చిస్తున్న ప్రియుడితో పారిపోయిన వివాహిత

  • ప్రతిరోజు కోడిగుడ్లు తెచ్చివ్వాలని భర్తను కోరిన భార్య
  • తన వద్ద అంత డబ్బు లేదని చెప్పిన భర్త
  • కోడిగుడ్లు తెచ్చివ్వట్లేదని జంప్

చిన్న విషయాలకే అలిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా, కంపేర్‌గంజ్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. తనకు ఇష్టమైన కోడిగుడ్లు తీసుకురావడం లేదని, భర్తను వదిలి వెళ్లిపోయిందో భార్య. కంపేర్‌గంజ్‌లో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త కూలీ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే, ప్రతిరోజు తినడానికి గుడ్లు ఉండాల్సిందేనని అతడిని భార్య కోరేది.

అందుకు కూలీ డబ్బులు సరిపోకపోవడంతో ఆ భర్త తన భార్య కోరికను నెరవేర్చడం లేదు. దీంతో నిన్న ఆమె భర్తతో గొడవపడి ప్రియుడితో పారిపోయింది. ఆ భర్త ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తన బాధను చెప్పుకున్నాడు. తానో దినసరి కూలీనని, ఈ బలహీనతతో తన భార్య తనతో ఆడుకుందని వాపోయాడు. ఆమె ప్రియుడు ప్రతి రోజు గుడ్లు తెచ్చి ఇచ్చేవాడని చెప్పాడు. అందుకే అతడితో ఆమె పారిపోయిందని చెప్పాడు.


  • Loading...

More Telugu News