Buddha Prasad: అమెరికాలో 'బుద్ధ ప్రసాద్ డే'... తెలుగు భాషాభిమానికి విశిష్ట గౌరవం

  • అక్టోబరు 25 బుద్ధ ప్రసాద్ డేగా ప్రకటన
  • సర్టిఫికెట్ ప్రదానం
  • ప్రకటన చేసిన నేపర్ విల్లే మేయర్

మండలి బుద్ధ ప్రసాద్ అంటే సిసలైన తెలుగు భాషాభిమానానికి పర్యాయపదం అని చెప్పాలి. తెలుగు భాషకు ఆయన అందించిన సేవలకు సొంతగడ్డపైనే కాదు, విదేశీ గడ్డపైనా విశిష్ట గుర్తింపు లభించింది. అక్టోబరు 25వ తేదీని 'డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ డే' గా అమెరికాలోని నేపర్ విల్లే నగర మేయర్ స్టీవ్ చికాగో ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ మేరకు సర్టిఫికెట్ ను కూడా బుద్ధ ప్రసాద్ కు బహూకరించారు. భాషాభిమానిగానే కాకుండా బుద్ధ ప్రసాద్ సమాజానికి కూడా తనవంతు సేవలు అందిస్తున్నారు.

పశువుల కోసం పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు చోట్ల పశుపక్ష్యాదుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించారు. గాంధేయ వాదాన్ని ప్రవచించడమే కాకుండా, అక్షరాలా పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని బుద్ధ ప్రసాద్ ను నేపర్ విల్లే నగర్ మేయర్ స్టీవ్ చికాగో కొనియాడారు.

  • Loading...

More Telugu News