Andhra Pradesh: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో ఏపీ సర్కారు ఒప్పందం
- చేనేత రంగానికి చేయూత
- జగన్ సర్కారు కీలక నిర్ణయం
- నవంబరు 1 నుంచి ఆన్ లైన్ లో చేనేత వస్త్రాల అమ్మకం
ఏపీలో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనూ చేనేత వస్త్రాల అమ్మకాలు సాగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. నవంబరు 1 నుంచి ఆన్ లైన్ పోర్టళ్లలో చేనేత వస్త్రాల అమ్మకాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి వాటిని ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఆప్కో కార్యాచరణ రూపొందిస్తోంది.