Soyam Bapurao: రూ.10 వేలు ఇస్తే ఆదివాసీలు అమ్ముడుపోరు: బీజేపీ ఎంపీ సోయం బాపురావు
- అవాకులు చెవాకులు పేలితే అట్రాసిటీ కేసు పెడతా
- ఎమ్మెల్యే జోగు రామన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
- నేను పిలుపు ఇస్తే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఉండదు
ఎమ్మెల్యే జోగు రామన్నపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు విమర్శలతో విరుచుకుపడ్డారు. నోటికొచ్చినంత మాట్లాడటం తగదని, అవాకులు చెవాకులు మాట్లాడితే.. అట్రాసిటీ కేసు పెడతానని హెచ్చరించారు. ఈరోజు సోయం మీడియాతో మాట్లాడారు. నేను పిలుపునిస్తే ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఉండవు. యురేనియం పాపం జోగు రామన్నదే అని పేర్కొన్నారు.
గుస్సాడీలకు పదివేల రూపాయలు ఇస్తే అమ్ముడుపోరు. డబ్బులిచ్చి ఆదివాసీల ఉద్యమాన్ని నీరుగార్చలేరని చెప్పారు. ‘జోగురామన్నా, జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగిస్తాను. గుస్సాడీలకు పదివేలు ఇచ్చుడు కాదు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలను తొలగించకలేకపోతున్నారు. సీఎం రాష్ట్రాన్ని దళారుల చేతుల్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దింపేవరకు ఆదివాసీల పోరాటం ఆపేది లేదు. నక్సలైట్ ప్రాంతాల నిధులతో టీఆర్ఎస్ నేతల పొలాలకు రోడ్లు వేసుకున్నారు’ అని సోయం ధ్వజమెత్తారు.