Pawan Kalyan: కార్తీకమాసంలో నిర్వహించే వన సమారాధనలు కుల భోజనాలు కాకూడదు: పవన్ కల్యాణ్
- వన రక్షణ ప్రారంభించిన జనసేన
- తన వ్యవసాయ క్షేత్రం నుంచే షురూ చేసిన పవన్
- ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని వెల్లడి
పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ వన రక్షణ పేరుతో వన మహోత్సవం షురూ చేసింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంచే పవన్ కల్యాణ్ వన రక్షణ కార్యక్రమం ప్రారంభించారు. జన సైనికులతో దగ్గరుండి మరీ మొక్కలు నాటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతేనని స్పష్టం చేశారు. పవిత్రమైన కార్తీకమాసంలో పర్యావరణం కోసం ముందుకు కదిలామని, ఇది నిరంతరం జరిగే కార్యక్రమమని అన్నారు. అంతేకాకుండా, కార్తీకమాసంలో నిర్వహించే వన సమారాధనలు కుల భోజనాలు కాకూడదని, ఏ ఒక్క వర్గానికో పరిమితం కారాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. ప్రకృతితో ఎలా కలిసిపోవాలో పురాణాలు, వేదాలు వివరించాయని తెలిపారు.