Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. ట్రేడింగ్ ఆద్యంతం లాభాలే!
- 582 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 160 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 16 శాతం పైగా పెరిగిన టాటా మోటార్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత లాభాల వైపు మళ్లిన మార్కెట్లు... ట్రేడింగ్ చివరి వరకు వెనుదిరిగి చూసుకోలేదు. ఆటో, మెటల్ సూచీలు నాలుగు శాతంపైగా లాభపడ్డాయి. కేవలం టెలికాం సూచీ మాత్రమే (-4.39%) నష్టాలను మూటగట్టుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 582 పాయింట్లు పెరిగి 39,831కి ఎగబాకింది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787కు పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (16.63%), టాటా స్టీల్ (7.09%), యస్ బ్యాంక్ (6.30%), యాక్సిస్ బ్యాంక్ (4.06%), మారుతి సుజుకి (4.01%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.41%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.64%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.55%).