Russia: ఈసారి జల్లికట్టు క్రీడకు విశిష్ట అతిథి... తమిళనాడుకు రానున్న పుతిన్?
- జనవరిలో జరిగే జల్లికట్టు క్రీడను తిలకించనున్న రష్యా అధ్యక్షుడు!
- ప్రధాని మోదీ కూడా ఉత్సవాలకు రాక
- అధికారికంగా ధ్రువీకరించలేదన్న రాష్ట్ర మంత్రి ఉదయ కుమార్
తమిళనాడులో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్నట్లు సమాచారం. అలాగే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మధురై సమీపంలోని అలంగనూర్ లో జరిగే జల్లికట్టు క్రీడ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. వేలమంది ప్రత్యక్షంగా చూస్తుండగా ఈ క్రీడలో ఎద్దులను బరిలోకి వదులుతారు. వాటిని లొంగదీసుకునే ప్రక్రియ ఈ క్రీడలో ముఖ్యాంశం.
ఈ క్రీడను చూసేందుకు విదేశాలనుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. వచ్చే ఏడాది జనవరిలో అలంగనూర్ లో జరిగే ఈ ఉత్సవాలకు పుతిన్ వస్తున్నట్లు మధురై జిల్లా పాలనా యంత్రాంగం అనధికారికంగా చెబుతోంది. మరోవైపు పుతిన్ రాకపై తమిళనాడు రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్ స్పందిస్తూ.. ఈ వార్తలు అధికారికమైనవి కావని తెలిపారు.