Maharashtra: శివసేన హెచ్చరికల బేఖాతరు... శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న దేవేంద్ర ఫడ్నవీస్!
- విభేదాలు సర్దుకుంటాయి
- వచ్చే ఐదేళ్లూ బీజేపీ ప్రభుత్వమే
- మీడియాతో దేవేంద్ర ఫడ్నవీస్
50-50 ఫార్ములాను అమలు చేయాలని, తమ నేత ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీజేపీకి సహకరించేది లేదని శివసేన పార్టీ అధిష్ఠానం చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోని దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే, ఈలోగానే శివసేనతో ఉన్న విభేదాలు సర్దుకుంటాయని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరినా, అది సుదీర్ఘకాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందనడంలో సందేహం లేదని వార్సాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.