Dalit: అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 30 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ ను కోరుదాం: తాటికొండ రాజయ్య

  • ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయి
  • ఎక్కడా భూములు దొరకడం లేదు
  • ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారు

తెలంగాణలో ఉన్న దళితులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. కేవలం అర్హత కలిగిన దళితులకు మాత్రమే మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయని... ఎక్కడా భూములు దొరకడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరుదామని సూచించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు.

ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారని రాజయ్య అన్నారు. మాదిగల్లోని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే వారు పోరాటం చేయాలని చెప్పారు. మాదిగ ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా పని చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభివృద్ధి కోసం మాదిగ సంఘాలు - మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News