Andhra Pradesh: నిరాధార వార్తల విషయంలో.. సంచలన జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- నిరాధార వార్తలు రాస్తే ఇక చట్టపరమైన చర్యలు
- ఎడిటర్లు, పబ్లిషర్లపై కేసులు పెట్టేలా అధికారాలు
- సోషల్ మీడియా వార్తలపైనా కేసులు
నిరాధార వార్తలు ప్రచురించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం సంచలన జీవోను విడుదల చేసింది. ఇకపై నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, సోషల్ మీడియాలో చేసే పోస్టులపైనా చర్యలు తీసుకోనుంది. ఆయా పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనేలా ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసింది. వార్తలు ప్రచురించే పబ్లిషర్లు, ఎడిటర్లపై కేసులు దాఖలు చేసేలా ఆయా శాఖల అధికారులకు అధికారం ఇచ్చింది.