america: హెచ్ 1బీ దరఖాస్తుల తిరస్కరణలో భారత్ టెకీలవే అధికం!

  •  ట్రంప్  వీసాల నిబంధనలు కఠినతరం చేయడమే కారణం
  • 2015- 2019 మధ్య 70 శాతం భారతీయుల దరఖాస్తులు తిరస్కరణ  
  •  కాగ్నిజెంట్‌ కంపెనీకి చెందిన 60 శాతం దరఖాస్తులు తిరస్కరణ

అమెరికన్లకే ఉద్యోగాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ సర్కార్ విదేశీ ఉద్యోగుల వీసాల నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయులకు దక్కే హెచ్-1బీ వీసాలు తగ్గిపోయాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులను పరిశీలిస్తే, హెచ్‌-1బీ దరఖాస్తులు 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో మూడు రెట్లు తగ్గాయని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సిటిజన్‌ పాలసీ(యూఎస్‌సీఐఎస్‌) పేర్కొంది.

ఈ కాలంలో 70 శాతం భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయని పేర్కొంది. వీరిలో కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివి ఎక్కువగా ఉన్నాయని ఎన్‌ఎఫ్‌ఏపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండర్సన్‌ చెప్పారు. 2018లో భారత్‌కు చెందిన ఆరు సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్‌-1బీ వీసాలు రాగా, అమెరికాకు చెందిన అమెజాన్‌ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం ఏకంగా 2,399 హెచ్‌-1బీ వీసాలు వచ్చాయన్నారు.

టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ కంపెనీకి చెందిన 60 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, తరువాతి స్థానంలో విప్రో, ఇన్ఫోసిస్‌ ఉన్నాయన్నారు. విదేశీ ఉద్యోగుల విషయంలో ఆపిల్‌, వాల్‌మార్ట్‌, కమ్మిన్స్‌ లాంటి కంపెనీల వీసాల మంజూరులో పెద్దగా మార్పులేదని ఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.

  • Loading...

More Telugu News