YSRCP: ఏపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇసుక కొరత: బీజేపీ నేత మాణిక్యాలరావు
- పార్టీ నాయకుల ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
- వారం రోజుల్లో ఇసుక అందుబాటులోకి తేవాలి
- భవన నిర్మాణ కార్మికులకు పరిహారం అందించాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత విధానం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని, కూలీలు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, దీన్ని ముందు అరికట్టాలన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేదంటే సత్యాగ్రహం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్వాకం వల్లే కార్మికులు అర్ధాకలితో అలమటించే పరిస్థితి ఎదురైనందున తక్షణం కార్మికుల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.