rayalaseema: హైకోర్టుతోపాటు రాజధాని కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్
- అధ్యయనం పేరుతో కాలయాపన చేయవద్దు
- మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుంటే తప్పేంటి
- రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటం
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టుతోపాటు రాష్ట్ర రాజధానిని కూడా రాయల సీమలో ఏర్పాటు చేయడం మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. రాజధాని కోసం అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం కంటే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసే పరిస్థితులు తేవొద్దని హితవు పలికారు. రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయల సీమపై అభిమానం ఉంటే రాంగోపాలవర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని వెంకటేశ్ అన్నారు. వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.