Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ముర్ము ప్రమాణ స్వీకారం
- శ్రీనగర్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
- నేటి నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్
- 28కి తగ్గిన రాష్ట్రాల సంఖ్య, 9కి పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాలు
కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా గిరీష్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధికరణ 370 రద్దుతో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు కేంద్రం అక్టోబర్ 31ని రీఆర్గనైజేషన్ డేగా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు లెహ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ గీతా మిట్టల్ లడక్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ గా రాధాకృష్ణ మాథుర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారడంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గగా, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి పెరిగింది.