imran khan: కర్తార్ పూర్ కు వచ్చే యాత్రికులకు పాస్ పోర్ట్ అవసరం లేదు.. ఐడీ చాలు: ఇమ్రాన్ ఖాన్
- ఈ నెల 9న కర్తార్ పూర్ నడవా ప్రారంభం
- భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే చాలు
- ప్రారంభోత్సవం రోజున రుసుము కూడా లేదు
భారత్ నుంచి పాకిస్థాన్ లోని కర్తార్పూర్ గురుద్వారా సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు అవసరమైన రెండు చర్యలు తీసుకున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే చాలని, పాస్పోర్ట్ అవసరం లేదని చెప్పారు. అలాగే, 10 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అవసరం లేదన్నారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున (ఈ నెల 9) ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ట్విటర్ లో వెల్లడించారు.
సిక్కు మత గురువు గురునానక్ గురుద్వారాను 1522 లో స్థాపించారు. పంజాబ్ గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ ప్రార్థనాలయాన్ని పాకిస్థాన్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలుపుతూ కర్తార్ పూర్ నడవా నిర్మించారు. ఈ నడవాను నవంబర్ 9న ప్రారంభిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించారు. భారత్ నుంచి వచ్చే యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలని పాక్ భావిస్తోంది.