Jagan: వ్యక్తిగత కేసుల ఖర్చును సొంతంగా భరించాలి: జగన్ కు చినరాజప్ప సూచన
- ఆ ఖర్చులను ప్రభుత్వమెలా భరిస్తుంది?
- కోర్టుకు హాజరైతే ప్రజాధనం వృథా అవుతుందనడం సరికాదు
- రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసేలా జగన్ పాలన
వ్యక్తిగత కేసులకు అయ్యే ఖర్చులను సొంతంగా పెట్టుకోవాలి కానీ, ఆ ఖర్చులను ప్రభుత్వమెలా భరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిలదీశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాస్తుల కేసులో తాను ప్రతి వారం కోర్టు వాయిదాలకు హాజరైతే ప్రజాధనం వృథా అవుతుందని జగన్ అనడం సరికాదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై చినరాజప్ప విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసేలా జగన్ పాలన తయారయిందన్నారు. మరోవైపు, తమ పార్టీని అంతమొందించేలా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దిగువ స్థాయిలో పనేమీ లేదని ఆయన ఆరోపించారు.