Vijay Devarakonda: ఐమ్యాక్స్ లో టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ

  • 'మీకు మాత్రమే చెప్తా' చిత్రంతో నిర్మాతగా మారిన విజయ్ దేవరకొండ
  • ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
  • టికెట్ కౌంటర్ లో విజయ్ ను చూసి అభిమానుల్లో హుషారు
టాలీవుడ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా వచ్చిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ సినిమా ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అయ్యాడు. 'మీకు మాత్రమే చెప్తా' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ సినీ థియేటర్ లో టికెట్ బుకింగ్ కౌంటర్ లో సందడి చేశాడు. టికెట్ కౌంటర్ లో విజయ్ ను చూడగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. విజయ్ కూడా తనదైన శైలిలో చలాకీగా మాట్లాడి, టికెట్లు అమ్ముతూ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు.
Vijay Devarakonda
Meeku Matrame Cheptha
Tarun Bhaskar
IMAX
Tickets
Hyderabad

More Telugu News