USA: అమెరికా తెలుగు సమాజంలో విషాదం.... ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శివ చలపతిరాజు మరణం
  • భార్య సౌజన్య గర్భవతి
  • ఇటీవలే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న శివ
అమెరికాలో శివ చలపతిరాజు అనే తెలుగు యువకుడు మరణించాడు. ఆయన నార్త్ కరోలినాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. శివ ఏపీలోని గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. అయితే అతను ఎందుకు చనిపోయాడన్న దానిపై వివరాలు వెల్లడికాలేదు. శివ భార్య సౌజన్య గర్భవతి. ఆమె అమెరికా గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లిస్ట్ లో ఉన్నారు. భర్త మృతితో తల్లడిల్లిపోతోంది. శివ ఇటీవలే అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని భారత్ తరలించేందుకు తెలుగు సంఘాల సభ్యులు నిధులు సేకరిస్తున్నారు.
USA
Shiva Chalapathi Raju
North Carolina

More Telugu News