Yuvraj Singh: ధోనీ భవిష్యత్తుపై ప్రశ్నించిన మీడియాకు యువరాజ్ ఘాటు సమాధానం

  • ధోనీ భవితవ్యంపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు
  • మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉంది
  • ఆటగాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ధోనీపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించిన మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఈ అంశంపై స్పందించాడు. ధోనీ భవితవ్యం ఎలా ఉండబోతోందంటూ ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 'నాకు తెలియదు బాస్. మన గ్రేట్ సెలెక్టర్లు మీకు ఎప్పుడైనా తారసపడితే... ఆ విషయాన్ని వారినే అడగండి. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. నేను కాదు' అని చెప్పాడు.

మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. సెలెక్టర్ల పని అంత తేలికైనది కాదని అన్నాడు. 15 మంది ఆటగాళ్లను జట్టులోకి సెలెక్ట్ చేసినప్పుడు... అర్హత కలిగిన మరో 15 మంది ఆటగాళ్లపై చర్చ జరుగుతుందని చెప్పాడు. ఆధునిక క్రికెట్ కు తగ్గ స్థాయిలో మన సెలెక్టర్లు లేరనేది తన అభిప్రాయమని తెలిపాడు.

తాను ఎల్లప్పుడూ ఆటగాళ్లకు మద్దతుగానే ఉంటానని యువీ చెప్పాడు. ఆటగాళ్ల గురించి, జట్టు గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని అన్నాడు.

  • Loading...

More Telugu News