spider: అధునాతన ‘సెన్సర్‌’ రూపకల్పనకు సాలీడు స్ఫూర్తి!

  • అమెరికాలోని హార్వర్డ్‌ జాన్‌ ఎ.పాల్సన్‌ స్కూల్‌ శాస్త్రవేత్తల రూపకల్పన
  • కీటకాలు ఎంత దూరంలో ఉన్నాయో కచ్చితంగా గుర్తించే సాలీడు
  • ఈ విషయం ఆధారంగా  'డెప్త్‌ సెన్సర్‌'

ఆహారాన్ని సంపాదించుకోవడంలో సాలీడు ప్రదర్శించే స్ఫూర్తితో అమెరికాలోని హార్వర్డ్‌ జాన్‌ ఎ.పాల్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తలు డెప్త్‌ సెన్సర్‌ను రూపొందించారు. ఆహారం కోసం సాలె పురుగులు పక్కా ప్రణాళికతో వ్యూహాన్ని రచించుకొని దాన్ని అమలు చేస్తాయి. లాలాజలంతో సాలెగూడు నిర్మించుకోవడం, దాని వద్దకు వచ్చే క్రిమికీటకాలను పట్టేయడం వంటి సాలీడు పనితీరు విస్మయం కలిగించేలా ఉంటుంది.

కీటకాలు తనకు ఎంత దూరంలో ఉన్నాయన్న విషయంపై కచ్చితమైన అంచనా వేసుకుంటాయి. సాలీడు వ్యూహరచన స్ఫూర్తితోనే శాస్త్రవేత్తలు సరికొత్త డెప్త్‌ సెన్సర్‌ ను రూపొందించారు. ఈ సెన్సర్ తో స్మార్ట్ వాచీలు, మినీ రోబోలు, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ హెడ్‌సెట్ల వాడకం మరో కొత్త మలుపు తిరిగే అవకాశముందని వారంటున్నారు. ఈ సెన్సర్ తో తన వీక్షణ పరిధిలోకి వచ్చే వస్తువు ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని కచ్చితమైన కొలతలతో నిర్ధారించుకోవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News