rtc: విధుల్లోకి వెళుతున్న భైంసా బస్ డిపో మేనేజర్ పై దాడి!
- నేటి అర్ధరాత్రితో ముగుస్తున్న కేసీఆర్ పెట్టిన డెడ్‌లైన్
- డిపో మేనేజర్ పై ముసుగు వేసి దాడి
- తమకు సంబంధం లేదన్న అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ నేటి అర్ధరాత్రితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం విధుల్లోకి వెళుతోన్న నిర్మల్ జిల్లా, భైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్‌పై ముసుగు వేసి కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండిస్తూ, నిందితులని శిక్షించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు పలు ప్రాంతాల్లోనూ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. కాగా, భైంసా డిపో మేనేజర్ జనార్దన్ పై దాడికి, ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అంటున్నారు. తాము నెల రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నామన్నారు.