WEF: ప్రపంచ ఎకనామిక్ ఫోరం మెగాసిటీల జాబితాలో హైదరాబాద్.. కవిత హర్షం

  • వచ్చే పదేళ్లలో నగర జనాభా కోటి దాటుతుందని అంచనా
  • ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 68.1 లక్షలు
  • రేసులో దూసుకుపోతున్న టోక్యో, షాంఘై, న్యూయార్క్

రాబోయే పదేళ్లలో హైదరాబాద్ మెగాసిటీగా అవతరించనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. 2030 నాటికి హైదరాబాద్ జనాభా ఒక కోటి దాటుతుందని, భవిష్యత్ లో మెగాసిటీల స్థాయి అందుకునే 10 నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంటుందని ఫోరం ఓ కథనంలో పేర్కొంది. ఇప్పటికే టోక్యో, ఢిల్లీ, షాంఘై, మెక్సికో సిటీ, న్యూయార్క్, కైరో రేసులో ముందున్నాయని, ఆ తర్వాత లాగోస్, జకార్తా, చోంగ్ కింగ్, చెంగ్డు, హైదరాబాద్, లువాండా వంటి నగరాలు మెగా స్థాయికి పరుగులు తీస్తున్నాయని వివరించింది.

ఈ నివేదికపై మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత స్పందించారు. భావి మెగా నగరాల జాబితాలో హైదరాబాద్ ను చూస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 68.1 లక్షలు.

  • Loading...

More Telugu News