Narendra Modi: మోదీకి లేఖ రాసిన జగన్
- ఏపీ జెన్ కోకు ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించండి
- రాష్ట్ర విభజన తర్వాత సింగరేణిని తెలంగాణకు కేటాయించారు
- బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదు
ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్ కు ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సింగరేణి కాలరీస్ ను తెలంగాణకు కేటాయించారని... బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమని తెలిపారు. జగన్ లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.