Pawan Kalyan: రాజధానిని పులివెందులకు మార్చండి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తే వెళ్లిరావడానికి వీలుగా ఉంటుంది: పవన్ కల్యాణ్ వ్యంగ్యం
- విశాఖలో కార్యకర్తలతో భేటీ
- సీఎం జగన్ పై పవన్ వ్యాఖ్యలు
- ఖర్చులు ఆదా అవుతాయని వెల్లడి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తన విమర్శల దాడికి మరింత పదునుపెట్టారు. ఇప్పటివరకు వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన పవన్ ఈసారి సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే, పులివెందుల నుంచి కర్నూలు వెళ్లిరావడం ఎంతో సులభం అని, అందుకే రాజధానిని పులివెందులకు మార్చుకోవాలని సెటైర్ వేశారు. తద్వారా సీఎం జగన్ కు ఖర్చు కూడా మరింత ఆదా అవుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తొలగింపు జీవో ఇచ్చిన వారిని తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ జీవోపై వెల్లువెత్తుతున్న విమర్శలు చూసి సీఎం జగన్ ఆ జీవో సంగతి తనకు తెలియదంటున్నారని పవన్ ఆరోపించారు.