CPI Narayana: తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ ఆ పని చేయలేరు: సీపీఐ నారాయణ
- ఆర్టీసీని కేసీఆర్ ప్రైవేటు పరం చేయలేరు
- కేసీఆర్ ధోరణి వల్లే కార్మికులు సమ్మె బాట పట్టారు
- కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవి
ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత ధోరణి, ఆయన చేసిన తప్పిదం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత వారితో కేసీఆర్ చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా... ఆర్టీసీని ప్రైవేటు పరం చేయలేరని వ్యాఖ్యానించారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.