heart: గుండె ఆపరేషన్లు చేయించుకున్నాక ఒంటరితనానికి గురైతే ముప్పే!

  • తేల్చిన డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ పరిశోధకులు 
  • 13,000 మంది రోగుల జీవనశైలిపై పరిశోధన
  • ఒంటరితనంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోతోన్న వైనం

ఒంటరితనం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఫలితంగా మనిషి భావోద్వేగాలపై అదుపు కోల్పోతాడు. ఈ కారణాల వల్లే గుండె సంబంధిత ఆపరేషన్ లు చేయించుకున్నవారు, ఆ తర్వాతి రోజుల్లో ఒంటరితనానికి గురైతే ప్రాణాలు కోల్పోతున్నారని ఓ పరిశోధనలో తేలింది.

ఆపరేషన్ తర్వాత మనిషి ఒంటరితనాన్ని భరించలేక మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నట్లు డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 2013-14 మధ్య గుండె వైద్యం చేయించుకున్న 13,000 మంది రోగుల జీవనశైలిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. రోగుల శారీరక, మానసిక ఆరోగ్యం, వారు తీసుకుంటోన్న ఔషధాలు, వారి అలవాట్ల వివరాలను కూడా పరిశీలించారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్న అనంతరం రోగులు ఒంటరి తనానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News