ISIS: కొత్త రకం జిహాద్ మొదలుపెట్టిన ఐసిస్!

  • అడవులను తగలబెట్టాలని సానుభూతిపరులకు పిలుపు
  • నోటర్ డామ్ చర్చి మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపమంటూ ప్రచారం
  • ఖలీఫారాజ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో సందేశాలు

జిహాదీలో భాగంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో అడవులను తగలబెట్టండంటూ ఐసిస్‌ క్యాడర్‌కు దాని ప్రచార సంస్థ ‘ఖురేశ్‌’ పిలుపునిచ్చింది. అమెరికాలో ఇటీవల కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, అటు స్పెయిన్ లో చెలరేగిన కార్చిచ్చుతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాద సంస్థ అడవులను తగులబెట్టండంటూ పిలుపునివ్వడం గమనార్హం.

అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల్లో అడవులను తగులబెట్టి ప్రజల్లో భయాందోళనలు కల్గించి పర్యావరణ పరిస్థితులను దిగజార్చాలని ఐసిస్ సానుభూతిపరులకు సామాజిక మాధ్యమం ద్వారా పిలుపునిచ్చింది. పారిస్‌లోని నోటర్ డామ్ కేథడ్రల్‌ చర్చి గత ఏప్రిల్‌లో మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపంగా, తమ విజయంగా ఐసిస్ పేర్కొంది. సిరియాలో ఈ సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైనికులు హతమార్చినప్పటికీ ఐసిస్ తన పంథాను వీడలేదు. ఖలీఫా రాజ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది.

  • Loading...

More Telugu News