Maharashtra: గవర్నర్ ను కలవనున్న బీజేపీ నేతలు... మహారాష్ట్రలో మరింత పెరిగిన ఉత్కంఠ
- మహారాష్ట్రలో కొనసాగుతోన్న రాజకీయ ప్రతిష్టంభన
- బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో గవర్నర్ తో భేటీ
- గవర్నర్ తో భేటీ కానున్న బృందంలో లేని ఫడ్నవీస్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సమయం అతి తక్కువగా ఉండడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవనున్నారు. గవర్నర్ తో భేటీ కానున్న నేతల బృందంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లేరు. దీంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవలే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత (బీజేపీఎల్పీ)గా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన లేకుండానే గవర్నర్ తో బీజేపీ నేతలు భేటీ అవుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీకి 105 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేకు 56 సీట్లు దక్కాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ శివసేన డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది.