India Map: భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ పై నేపాల్ అభ్యంతరం
- కాలాపానీ ప్రాంతం భారత్ లో ఉన్నట్టు చూపించారు
- భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం
- సరిహద్దుల అంశంపై కూడా చర్చిస్తాం
ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశానికి చెందిన కాలాపానీ అనే ప్రాంతాన్ని భారత్ లో ఉన్నట్టు మ్యాప్ ను రూపొందించారని ఆరోపించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. ఇదే సమయంలో సరిహద్దులకు సంబంధించిన విషయంపై కూడా చర్చిస్తామని ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన నేపథ్యంలో, భారత ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.