Ayodhya: అయోధ్య కేసు తీర్పు.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోంశాఖ
- తుది తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు
- అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
- సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పును త్వరలో వెలువరించబోతోంది. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని భద్రతా చర్యలను తీసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని సూచించింది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ కు కేంద్ర హోంశాఖ ఇప్పటికే 4 వేల అదనపు పారామిలిటరీ బలగాలను తరలిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని కొన్ని ముస్లిం సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.