benj luxary car: భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీచర్స్!
- రూ.1.10 కోట్ల విలువైన 'వి-క్లాస్ ఎలైట్' విడుదల
- అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్న లగ్జరీ కారు
- 11 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం..!
భారత్ లో విలాసవంతమైన కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎంపీవీని విడుదల చేసింది. రూ.1.10 కోట్ల ధర ఉన్న ఈ కార్ ను 'వి-క్లాస్ ఎలైట్' గా పిలుస్తారు. గతంలో విడుదల చేసిన వి-క్లాస్ మోడల్ కు కొనసాగింపుగా తాజా కారును భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఈ కారు ఫీచర్స్ కూడా గత మోడల్ తో పోలిస్తే ఆధునికీకరించారు. బంపర్, హెడ్ ల్యాంప్,గ్రిల్, అలాయ్ వీల్స్ తో కూడిన 'వి-క్లాస్ ఎలైట్' కారు స్టీల్ బ్లూ, సెలెనైట్ గ్రే, గ్రాఫైట్ గ్రే రంగుల్లో లభించనుంది. 2.0 లీటర్ల ఇంజిన్ ను కలిగివున్న ఈ కారు 161బీహెచ్ పీ శక్తితో 380 ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అధునాతనమైన 9జీ ట్రానిక్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ దీని ప్రత్యేకత. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి పట్టేకాలం 11 సెకన్లు మాత్రమే.
ఇక కార్లో సౌకర్యాల విషయానికి వస్తే, దాని ధరకు తగ్గట్టే ఉన్నాయి. చిన్న రిఫ్రిజిరేటర్, మసాజ్, కూలింగ్, హీటింగ్ ఫీచర్స్ తో పాటు ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్, పనోరమిక్ సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, కమాండ్ ఆన్ లైన్ ఇంటర్ ఫేస్ ఇన్ఫోటైన్ మెంట్, ఏబీఎస్, ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా తదితర ఫీచర్లున్నాయి.