Maharashtra: మహారాష్ట్రలో మరికొన్ని రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రే కొనసాగింపు!
- బీజేపీ, శివసేన మధ్య కుదరని సయోధ్య
- న్యాయ సలహా తీసుకున్న మహారాష్ట్ర గవర్నర్
- కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగింపు
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమే లేదని, కొత్త సర్కారు ఏర్పడే వరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కొనసాగుతుందని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయపరమైన సలహా తీసుకున్నారని రాజ్ భవన్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ పదవీకాలం ప్రత్యేకంగా పొడిగించనవసరం లేకుండానే ఫడ్నవీస్ సర్కారును కొనసాగించవచ్చని అడ్వొకేట్ జనరల్ సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా, బీజేపీ, శివసేన మధ్య సీఎం పీఠం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది.