Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో అఫైర్... సీరియస్ గా స్పందించిన రష్మికా మందన్న!

  • సూపర్ హిట్ జోడీగా విజయ్, రష్మిక
  • అఫైర్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు
  • కొన్ని కామెంట్లను పట్టించుకోవాల్సి వస్తోంది
  • తనను నొప్పించాలన్న వారి కోరిక తీరిందన్న రష్మిక
టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ హిట్ జోడీ అంటే, తొలుత గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నలే. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో అఫైర్ నడుస్తోందన్న రూమర్లూ వస్తున్నాయి. తాజాగా, రష్మికను వ్యక్తిగతంగా కించపరిచేలా, విజయ్ తో అఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది.

దీన్ని చూసిన రష్మిక, సీరియస్ గా స్పందించింది. నటీ నటుల మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఏమొస్తుందో తెలియడం లేదని మండిపడింది. యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారన్న ఉద్దేశంలో వీరున్నారని, తాను పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన తమను డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యొచ్చని కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దని తనకు చాలా మంది చెబుతుంటారని, కానీ కొన్నింటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పుకొచ్చింది. సదరు పోస్ట్ ను పెట్టిన వాళ్లకు కంగ్రాట్స్‌ చెబుతూ, తనను నొప్పించాలనుకున్న వారు విజయవంతం అయ్యారని ఎద్దేవా చేసింది.
Rashmika Mandanna
Vijay Devarakonda
Affair
Social Media

More Telugu News