speaker: రాజకీయ విమర్శలకు తావిచ్చేలా సభాపతి వ్యవహరించడం తగదు!: తమ్మినేనిపై మాజీ మంత్రి యనమల మండిపాటు
- ఆయన రాజకీయ నాయకుడు కాదని గుర్తించాలి
- ఆటలో రిఫరీలాంటి బాధ్యత సభాపతిది
- సభా నాయకుడు, విపక్ష నాయకుడిది ఒకే స్థాయి గౌరవం
తమ్మినేని సీతారాం తన హోదా, బాధ్యత మర్చిపోయి మాట్లాడడం సరికాదని, స్పీకర్ స్థాయిని దిగజార్చేలా ఆయన వ్యవహారశైలి ఉండకూడదని మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకష్ణుడు హితవు పలికారు. చంద్రబాబు కుటుంబంపై తమ్మినేని సీతారాం చేసిన విమర్శలను యనమల తప్పుపట్టారు.
సభా నాయకుడికి ఏ స్థాయి గౌరవం ఉంటుందో, ప్రతిపక్ష నాయకుడికి అదే స్థాయి గౌరవం ఉంటుందని స్పీకర్‌కు తెలియదని అనుకోవాలా? అని ప్రశ్నించారు. స్పీకర్ ఆటలో రిఫరీ లాంటి వాడని, ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. అందువల్ల రాజకీయ విమర్శలకు తావిచ్చేలా సభాపతి వ్యవహరించడం తగదన్నారు.