YV Subba Reddy: ఆస్ట్రేలియాలో పంటలను పరిశీలించి విస్మయానికి గురైన వైవీ సుబ్బారెడ్డి
- ఆస్ట్రేలియాలో పర్యటించిన వైవీ
- వ్యవసాయ క్షేత్రాల సందర్శన
- ఆపిల్, క్యాబేజి, ద్రాక్ష పంటల పరిశీలన
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి సువిశాల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఆ దేశంలో వ్యవసాయ పంటల కోసం అనుసరిస్తున్న వినూత్న సాగు విధానాలు, చీడపీడల సస్యరక్షణ పద్ధతులు, అతి తక్కువ నీటి వినియోగంతో పంటలు పండిస్తున్న వైనాన్ని పరిశీలించిన వైవీ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన ఆపిల్, ద్రాక్ష, క్యాబేజీ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఆస్ట్రేలియా వ్యవసాయ పద్ధతులు అభినందనీయం అని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సాగు విధానాలు అమలు చేస్తే ఎంతో మేలు జరిగే అవకాశముందని ఆయన ట్వట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏపీలో సీఎం జగన్ చేపట్టిన రైతు భరోసా, సేంద్రియ విధానంలో రైతులు సాగు చేస్తున్న పంటల గురించి ఆస్ట్రేలియా వ్యవసాయ నిపుణులకు వివరించానని వైవీ తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఆంగస్ బృందంతో కలిసి ఆస్ట్రేలియాలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్టు వెల్లడించారు.