Supreme Court: షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం!
- తీర్పు చదువుతోన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్
- మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది.
- అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పు
ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తోంది. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఈ సందర్భంగా కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను కూడా తిరస్కరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ తీర్పును చదువుతున్నారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని అన్నారు. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుందని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పు ఇస్తున్నారు.