Ayodya decision: తీర్పులో మాకు ఆమోదంకాని విషయాలు ఉన్నాయి : ముస్లిం పర్సనల్ లా బోర్డు
- మరోసారి దృష్టిసారించాలని ఎపెక్స్ కోర్టును కోరుతాం
- న్యాయపరంగా ఎలా అడుగు వేయాలో నిర్ణయిస్తాం
- 15వ శతాబ్దం ముందు ఆధారాలుంటే తర్వాతవి ఎందుకు ఉండవని ప్రశ్న
రామ్‌జన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం ఈరోజు ఇచ్చిన తుది తీర్పుపై ముస్లిం పర్సనల్ లాబోర్డు స్పందించింది. వివాదాస్పద భూమిని రామ్‌జన్మభూమి న్యాస్‌కు అప్పగించడంపై లాబోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు చాలా ఉన్నాయని తెలిపింది. న్యాయస్థానం పేర్కొన్నట్లు పదిహేనో శతాబ్దానికి ముందు ఆధారాలు ఉంటే ఆ తర్వాత కాలానికి చెందిన చారిత్రక ఆధారాలు కూడా ఉంటాయి కదా? అని ప్రశ్నించింది.
కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ తమ అభ్యంతరాలను కూడా మరోసారి పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, చర్చ జరిగిన అనంతరం న్యాయపరంగా ఎలాంటి అడుగు వేయాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు.