Andhra Pradesh: ఇంగ్లీష్ మీడియంలో బోధన 1 నుంచి 6వ తరగతి వరకే: సీఎం జగన్
- పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం కట్టుబడివుంది
- నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఆంగ్ల భాషా ప్రయోగ శాలల ఏర్పాటు
- పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాల అమలుకు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఆంగ్లమాధ్యమ బోధనకు సంబంధించి సీఎం జగన్ తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. తొలి దశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపచేయాలని ఆదేశాలు జారీచేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన సీఎం పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకోసం పలు నిర్ణయాలను ప్రకటించారు.
ఈనెల14 నుంచి ప్రారంభం కానున్న నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సూచించారు. 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు పాఠశాలల్లో తగు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు చెప్పారు.