All people strike: సకల జనుల దీక్ష గ్రాండ్ సక్సెస్: అశ్వత్థామరెడ్డి
- ఆర్టీసీ మహిళా కార్మికుల తోడ్పాటుతో సాధ్యమైందని వెల్లడి
- ట్యాంక్ బండ్ పై మహిళలపై దాడి అమానుషం అంటూ వ్యాఖ్యలు
- రేపు అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్న అశ్వత్థామ
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సామూహిక దీక్ష విజయవంతమైందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఈ దీక్ష కోసం ఛలో ట్యాంక్ బండ్ పిలుపు ఇచ్చామని, భారీ సంఖ్యలో కార్మికులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాలు తోడ్పడ్డాయని తెలిపారు. మద్దతిచ్చిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలకు జేఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్ బండ్ పై మహిళలపై జరిగిన దాడిపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నిరసనగా రేపు ఉదయం అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు.