cyclone: బుల్ బుల్ తుపాను బీభత్సంపై మమతా బెనర్జీకి ఫోన్ చేసిన మోదీ
- పరిస్థితులు, భారీ వర్షాలపై మోదీ ఆరా
- కేంద్రం నుంచి సాయం అందుతుందని భరోసా
- సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించిన అధికారులు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'బుల్ బుల్' తుపానుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 'తూర్పు భారత దేశంలో తుపాను వల్ల చోటు చేసుకుంటోన్న పరిస్థితులు, భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించాను. బుల్ బుల్ తుపానుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడాను. బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సాయం అందుతుందని భరోసా ఇచ్చాను' అని ట్వీట్ చేశారు.
కాగా, పశ్చిమబెంగాల్ పై బుల్ బుల్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోన్న విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నామని మమతా బెనర్జీ తెలిపారు.