shiv sena: బీజేపీ విఫలమైతే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం: శివసేన

  • గవర్నర్‌ ఆహ్వానం మేరకు బీజేపీ బలనిరూపణ చేసుకోవాలి
  • గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
  • అనిశ్చితి కొనసాగడం మంచిది కాదు 
  • స్పష్టం చేసిన సంజయ్ రౌత్

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్‌ కోష్యారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో ఆయన సోమవారంలోగా బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ బలపరీక్షలో ఓడిపోతే అతి పెద్ద రెండో పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు తాము సంసిద్ధంగా ఉన్నామని శివసేన తెలిపింది.

గవర్నర్‌ ఆహ్వానం మేరకు అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాలని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. బీజేపీ విఫలమైతే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ ముందుకొస్తుందని స్పష్టం చేశారు. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సుదీర్ఘ కాలం పాటు ఇలా అనిశ్చితి కొనసాగడం మంచిది కాదన్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు గవర్నర్ తన ముందున్న అన్ని అవకాశాలు ఇస్తారు. రాజ్యాంగబద్ధ ప్రక్రియలన్నింటినీ ముగించాక కూడా ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారు.

  • Loading...

More Telugu News