Pawan Kalyan: మాతృభాషను ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హితవు
- ఏపీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం
- వెల్లువెత్తుతున్న విమర్శలు
- స్పందించిన పవన్ కల్యాణ్
ఏపీలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ వైసీపీ సర్కారుకు హితవు పలికారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదని తెలిపారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.