Sachin Tendulkar: సరికొత్త సాలె పురుగు జాతికి సచిన్ టెండూల్కర్ పేరు
- సాలె పురుగులపై పరిశోధన నిర్వహిస్తున్న ధ్రువ ప్రజాపతి
- రెండు కొత్త జాతులను కనుగొన్న పరిశోధకుడు
- 'మరెంగో సచిన్ టెండూల్కర్' అంటూ ఓ జాతికి నామకరణం
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓ కొత్త సాలె పురుగు జాతికి సచిన్ టెండూల్కర్ పేరిట నామకరణం చేశారు. గుజరాత్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో ధ్రువ ప్రజాపతి అనే వ్యక్తి సాలె పురుగులపై పరిశోధన నిర్వహిస్తున్నాడు. స్పైడర్ టాక్సానమీ పేరిట సాగిస్తున్న ఈ పరిశోధనలో రెండు సరికొత్త జాతుల సాలె పురుగులను కనుగొన్నారు.
వాటిలో ఒకదానికి సచిన్ పేరిట 'మరెంగో సచిన్ టెండూల్కర్' అని నామకరణం చేశాడు. మరో సాలె పురుగు జాతికి కేరళలో విద్యావ్యాప్తికి తోడ్పడిన సెయింట్ కురియకోస్ పేరు పెట్టారు. జీవజాతుల పరిశోధనకు సంబంధించిన ఆర్థ్రోపొడా సెలెక్టా అనే రష్యన్ జర్నల్ లో ఈ వివరాలు ప్రచురితం అయ్యాయి. ధ్రువ ప్రజాపతి బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ కు వీరాభిమాని.