Uttar Pradesh: అయోధ్యపై అనుచిత పోస్టులు.. రెండు రోజుల్లో 77 మంది అరెస్ట్
- పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
- సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్రిక్తతలు పెంచే పోస్టులు
- సోషల్ మీడియాలో 12 వేల పోస్టులపై చర్యలు
అయోధ్యపై అనుచిత పోస్టులు చేయవద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకోని వారికి పోలీసులు అరదండాలు వేశారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతి నుంచి నిన్నటి వరకు మొత్తం 77 మందిని అరెస్ట్ చేసినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా వీరంతా ఉద్రిక్తతలు పెంచే పోస్టులు చేసినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. శనివారం 34 కేసులు నమోదు కాగా, ఆదివారం 22 కేసులు నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77 మందిని అరెస్ట్ చేశామని, అలాగే, 12 వేల ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ పోస్టులపైనా చర్యలు తీసుకున్నట్టు పోలీసులు వివరించారు.