Bengaluru: ప్రాంక్ వీడియోల పేరుతో దెయ్యం వేషాలు.. జనాన్ని భయపెడుతున్న యువకుల అరెస్ట్!

  • బెంగళూరు శివారులో ప్రాంక్ వీడియోలు
  • హడలిపోయిన జనం
  • ఏడుగురు యువకుల అరెస్ట్

ప్రాంక్ వీడియోల పేరుతో దెయ్యం వేషాలు వేసుకుని రాత్రివేళ జనాన్ని భయపెడుతున్న యువకులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ప్రాంక్ వీడియోల కోసం బెంగళూరులోని ఆర్‌టీనగర్, నగవారా ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు దెయ్యం వేషాలు వేసుకుని శివారులోని యశ్వంత్‌పుర సమీపంలో ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఆ వైపుగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులను భయపెడుతూ వీడియో చిత్రీకరిస్తున్నారు.  

తెల్లని గౌన్లు ధరించి, రక్తపు మరకలతో రోడ్లపై అకస్మాత్తుగా వీరు ప్రత్యక్షమయ్యేసరికి జనం హడలిపోయారు. కొందరు దీనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిఘా వేసిన పోలీసులు.. యువకులు దెయ్యం వేషధారణలో రోడ్డుపైకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి  మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు చేసేది ప్రాంక్ వీడియోలే అయినా, చేసే విధానం ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News