sharad pawar: శరద్ పవార్ తో చర్చల కోసం ముంబయికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

  • చర్చల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • కాసేపట్లో ముంబయికి అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్
  • శరద్ పవార్ తో చర్చలు జరపనున్న నేతలు

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిన్న శివసేన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. ఆ పార్టీకి ఇచ్చిన గడువు ముగియడంతో మూడో అతిపెద్ద పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తమ సీనియర్ నేతలకు అప్పగించింది.

శరద్ పవార్ తో చర్చించేందుకు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్.. ముంబయి బయలుదేరారు. శరద్ పవార్ తో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ రోజు రాత్రి 8.30లోపు  గవర్నర్ కు ఎన్సీపీ తమ నిర్ణయాన్ని స్పష్టంగా తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News