Maharashtra: రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన
- రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేసిన కేంద్ర కేబినెట్
- తమకు తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ సుప్రీంలో శివసేన పిటిషన్
- బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపణ
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది. బీజేపీకి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని, తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపింది. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపించింది. మరోవైపు శివసేన తరపున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదించనున్నట్టు తెలుస్తోంది.