Maharashtra: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన... ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
- ప్రభుత్వ ఏర్పాటులో అన్ని పార్టీలు విఫలం
- రాష్ట్రపతి పాలన విధింపు
- మహారాష్ట్రలో ముగిసిన అనిశ్చితి
మహారాష్ట్రలో అందరూ ఊహించినట్టుగానే రాష్ట్రపతి పాలన వచ్చింది. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోగా, ప్రభుత్వ ఏర్పాటులో ఏ పక్షం సఫలం కాలేకపోయింది. దాంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. కోవింద్ నిర్ణయం కంటే ముందు మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు లాంఛనం పూర్తిచేసింది. దాదాపుగా క్యాబినెట్ సభ్యులందరూ రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అటు, గవర్నర్ సిఫారసు, ఇటు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.