Supreme Court: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలకు ఊరట.. ఆ 17 మందికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ సుప్రీం తీర్పు!
- ఫిరాయింపులను ప్రోత్సహించవద్దు
- ఆ బాధ్యత రాజకీయ పార్టీలదే
- అనర్హత వేటును సమర్థించిన సుప్రీంకోర్టు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించిన 17 మందికీ ఊరటనిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పును వెలువరించింది. ఆ 17 మందీ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది. వారిపై పడ్డ అనర్హత వేటును సమర్థించిన సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన ప్రజలను వారు మోసం చేసినట్టేనని అభిప్రాయపడింది.
మరోమారు ఇటువంటి తప్పు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని, ఫిరాయింపులను ప్రోత్సహించరాదని సూచించింది. ఇదే సమయంలో అనర్హత వేటు వేసిన స్పీకర్ పైనా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరినీ నిషేధించలేమని, ఆ అధికారం స్పీకర్ కు లేదని అభిప్రాయపడింది. 2025 వరకూ వారిపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నామని స్పష్టం చేసింది.